హైదరాబాద్‌ నగర పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండు గ్రూప్‌ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. నిన్న రాత్రి కేకే గార్డెన్స్‌ దగ్గరలోని ఖాళీ స్థలంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించరాదని.. మంచి చెప్పినందుకు మందుబాబులు ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. మరి కొందరు ఈ వివాదంలో జోక్యం చేసుకోవడంతో.. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు.

దుండగుల దాడిలో నర్సింహారెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయలు అయ్యాయి. కాగా దుండగులు ఘటన జరిగిన అనంతరం అక్కడి నుండి పరారయ్యారు. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనలో యువకుడి అంత దారుణంగా కొట్టి చంపడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story