4 ఏళ్లుగా మహిళపై సర్కిల్‌ ఆఫీసర్‌ అత్యాచారం.. ఇద్దరిపై కేసు నమోదు

Circle officer booked on rape charge in Bihar's Patna. పాట్నాలోని ఓ సర్కిల్ ఆఫీసర్‌పై అత్యాచార ఆరోపణల కింద కేసు నమోదైంది. గత నాలుగేళ్లుగా మహిళపై అత్యాచారం

By అంజి  Published on  18 Jan 2022 10:57 AM IST
4 ఏళ్లుగా మహిళపై సర్కిల్‌ ఆఫీసర్‌ అత్యాచారం.. ఇద్దరిపై కేసు నమోదు

పాట్నాలోని ఓ సర్కిల్ ఆఫీసర్‌పై అత్యాచార ఆరోపణల కింద కేసు నమోదైంది. గత నాలుగేళ్లుగా మహిళపై అత్యాచారం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. నాలుగేళ్ల క్రితం సర్కిల్‌ ఆఫీసర్‌ రఘువీర్‌ ప్రసాద్‌ బెట్టియాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అతడితో పరిచయం ఏర్పడిందని మహిళ తెలిపింది. "ప్రసాద్ మొదట్లో తండ్రిలా నాకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత నాతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. లైంగిక చర్యలకు సంబంధించిన వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు" అని బాధితురాలు తెలిపింది. తాను వద్దని తెలిపినప్పుడు తన పరువు తీస్తానని బెదిరించాడని ఆమె పోలీసులకు తెలిపింది. అప్పటి నుంచి పెళ్లి సాకుతో ఆమెతో శారీరక సంబంధాలు కొనసాగిస్తున్నాడు బాధితురాలు చెప్పింది.

"శనివారం అతను ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న పాట్నాలోని భక్తియార్‌పూర్‌కు నన్ను పిలిచాడు. ప్రసాద్ నన్ను షాపింగ్ చేయడానికి తీసుకెళ్లాడు, అక్కడ నా మొబైల్ ఫోన్, వాలెట్, ఇతర విలువైన వస్తువులను లాక్కున్నాడు. అతను నన్ను కూడా కొట్టాడు" అని మహిళ ఆరోపించింది. అయితే మహిళ తన అధికారిక వాహనానికి షాపింగ్‌ మాల్ వెలుపల నిప్పంటించిందని ప్రసాద్ ఆరోపించారు. అయితే బాధితురాలు ఆ ఆరోపణలను ఖండించింది. ప్రభుత్వ వాహనం దగ్ధమైనందున, పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ ఈ విషయంపై సమగ్ర విచారణ కోసం అధికారులను ఆదేశించారు. భక్తియార్‌పూర్ ఎస్‌హెచ్‌ఓ మాట్లాడుతూ: "రఘువీర్ ప్రసాద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ప్రభుత్వ వాహనానికి నిప్పంటించిన ఆరోపణపై ఒక మహిళపై క్రాస్ ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసాము. ప్రసాద్ ఫిర్యాదు చేశాడు. తదుపరి విచారణ కొనసాగుతోంది." అని తెలిపారు.

Next Story