లగ్జరీ కార్ లో వచ్చి ఏమి దొంగతనం చేశారంటే..?

Cattle thieves brandish swords, forcefully lift calf in luxury car. పశువులను దొంగతనం చేసే ఎన్నో ఘటనలను మనం చూసే ఉంటాం.

By Medi Samrat
Published on : 4 April 2022 10:39 AM IST

లగ్జరీ కార్ లో వచ్చి ఏమి దొంగతనం చేశారంటే..?

పశువులను దొంగతనం చేసే ఎన్నో ఘటనలను మనం చూసే ఉంటాం. అయితే ఏకంగా లగ్జరీ కార్లలో వచ్చి దొంగతనాలను చేసే విజువల్స్ ను మనం చూడడం చాలా అరుదు. అలాంటిది కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

పశువుల దొంగతనం తాలూకు ఘటనకు సంబంధించిన వీడియో ఇది. దుండగులు కత్తులు చూపుతూ చిత్ర శైలిలో ఆవులను దొంగిలించారు. ఈ సంఘటన ఏప్రిల్ 3 ఆదివారం తెల్లవారుజామున 2.45 గంటలకు జరిగింది. కరకల వద్ద బంగ్లెగుడ్డె విద్యా సరస్వతి మందిర్ క్యాంపస్‌లో ఆవులు ఉన్నాయి. పోలీసుల భయం లేకుండా నగరంలో ఆవుల దొంగతనాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దొంగిలించిన పశువులను తరలించేందుకు దొంగలు విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తున్నారు.

పశువుల దొంగతనాలను నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందని హిందూ సంఘాల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది మంది హిందూ సంస్థ కార్యకర్తలు రెండు రోజుల క్రితం పట్టపగలు పశువుల దొంగతనం గురించి తెలుసుకున్నారు. నకిలీ నంబర్‌ ప్లేట్లతో ఓమ్నీలో పశువులను తరలిస్తున్నారు. ఇప్పుడు ఆదివారం తెల్లవారుజామున రెండో ఘటన చోటుచేసుకుంది. దొంగలను పోలీసు శాఖ అదుపు చేయడం లేదని హిందూ సంస్థల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

Next Story