సెక్యూరిటీ గార్డును కాల్చి చంపి నగదుతో పరార్‌

Cash Van Guard Shot Dead Outside ICICI Bank ATM In Delhi. ఢిల్లీలోని జగత్‌పూర్ ఫ్లైఓవర్ సమీపంలో ఒక సెక్యూరిటీ గార్డును కాల్చి చంపి, ATM క్యాష్ వ్యాన్ నుండి

By M.S.R  Published on  10 Jan 2023 9:30 PM IST
సెక్యూరిటీ గార్డును కాల్చి చంపి నగదుతో పరార్‌

ఢిల్లీలోని జగత్‌పూర్ ఫ్లైఓవర్ సమీపంలో ఒక సెక్యూరిటీ గార్డును కాల్చి చంపి, ATM క్యాష్ వ్యాన్ నుండి 8 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు వ్యాన్ బయట ఉండగా వెనుక నుంచి వచ్చిన వ్యక్తి కాల్పులు జరిపి నగదుతో పరారయ్యాడు. బాధితుడు జై సింగ్ (55)ని ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు ప్రకటించారు. వజీరాబాద్ పరిధిలోని జగత్‌పూర్ ఫ్లైఓవర్ సమీపంలో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

"సాయంత్రం 4.50 గంటల క్యాష్ వ్యాన్ నగదు డిపాజిట్ చేయడానికి ATM వద్దకు వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. వెనుక నుండి ఒక వ్యక్తి వచ్చి క్యాష్ వ్యాన్ గార్డ్‌పై కాల్పులు జరిపి డబ్బుతో పారిపోయాడు" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాగర్ సింగ్ కల్సి చెప్పారు. నిందితుడిని పట్టుకోడానికి పలు బృందాలను ఏర్పాటు చేశామని, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను స్కాన్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


Next Story