హైదరాబాద్‌లో భారీ గోల్‌మాల్..ATMలలో వేయాల్సిన రూ.1.20 కోట్లతో ఉద్యోగుల పరార్!

హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో భారీ నగదు గోల్‌మాల్ వెలుగుచూసింది.

By -  Knakam Karthik
Published on : 12 April 2026 9:00 PM IST

Hyderabad, SR Nagar, CashRobbery, ATM Scam, CMS Info Systems, CrimeNews ,HyderabadPolice

హైదరాబాద్‌లో భారీ గోల్‌మాల్..ATMలలో వేయాల్సిన రూ.1.20 కోట్లతో ఉద్యోగుల పరార్!

హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో భారీ నగదు గోల్‌మాల్ వెలుగుచూసింది. ఏటీఎంలలో నగదు జమ చేయాల్సిన 'సీఎంఎస్' (CMS) ఇన్ఫో సిస్టమ్స్ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు రూ. 1.20 కోట్లతో పరారయ్యారు. సంస్థకు చెందిన కస్టోడియన్లు వాసిరెడ్డి, లతీఫ్ గత రెండు రోజులుగా విధులకు రాకపోవడంతో పాటు ఫోన్లలో కూడా అందుబాటులో లేకపోవడంతో మేనేజర్ నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో ఎస్‌ఆర్ నగర్ పరిధిలోని 8 ఏటీఎంలలో నగదు జమ చేయలేదని, మొత్తం రూ. 1,20,98,500 తక్కువగా ఉన్నట్లు తేలింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరోవైపు, నగరంలోని టోలిచౌకి, గోషామహల్ పరిధిలో పోలీసులు సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించారు. గోషామహల్ పోలీసులు అజీజ్ ప్లాజా వంటి వ్యాపార ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఫిషింగ్ లింక్‌లు, ఓటీపీ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేశారు. టోలిచౌకి పోలీసులు ఆటోల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ, ఎవరైనా ఆర్థికంగా మోసపోతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కొత్త రకమైన సైబర్ దాడుల నుంచి ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పించారు.

Next Story