సోమవారం బెంగళూరులో రద్దీగా ఉండే రోడ్డుపై అదుపు తప్పిన ఎస్‌యూవీ వాహనం పలు వాహనాలను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఎస్‌యూవీ డ్రైవర్ మోహన్‌ను అరెస్టు చేశారు. బ్రేక్‌లు వేయడానికి బదులు స్టాప్ సిగ్నల్ వద్ద కారును స్పీడ్ గా వెళ్లేలా యాక్సిలరేటర్ ను తొక్కడంతో కారుపై నియంత్రణ కోల్పోయినట్లు పోలీసులకు చెప్పాడు.
కారులో బీజేపీ ఎమ్మెల్యే హర్తాలు హాలప్ప అనే స్టిక్కర్ ఉంది కానీ అతనిది కాదని తెలుస్తోంది. కారులో ఎమ్మెల్యే కూడా లేరని పోలీసులు తెలిపారు. SUV రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ రాము సురేష్, ఎమ్మెల్యే కుమార్తె సుష్మిత హాలప్ప మామకి చెందినది. 48 సంవత్సరాల మోహన్.. సురేష్ దగ్గర పనిచేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతడు మద్యం తాగలేదు. కిమ్స్ ఆసుపత్రిలో మెడిసిన్ చదువుతున్న సుస్మిత హాలప్పను తీసుకెళ్లేందుకు మోహన్ వెళుతుండగా ఎస్‌యూవీ అదుపు తప్పి పలు కార్లను ఢీకొట్టింది. మజీద్ ఖాన్, అయ్యప్ప అనే ఇద్దరు వ్యక్తులపై SUV దూసుకెళ్లింది. వీరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో మరో రెండు కార్లు, మూడు బైక్‌లు ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు.