ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

Car Rammed into a parked lorry in Warangal District three dead.ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Nov 2022 8:14 AM IST
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఒకే కుటంబానికి చెందిన దంప‌తులు స‌హా కుమారుడు మృతి చెంద‌గా మ‌రో ఆరుగురు గాయ‌ప‌డ్డారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున వ‌రంగ‌ల్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

ఓ శుభకార్యం నిమిత్తం కారులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఒంగోల్ వెళ్లి తిరిగి వ‌రంగ‌ల్ జిల్లా పెరుకావాడ‌కు వ‌స్తున్న క్ర‌మంలో వర్ధన్నపేట పట్టణ శివారు డీసీ తండా వద్ద ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో మొత్తం 9 మంది ఉన్నారు. ఘ‌ట‌నాస్థ‌లిని ప‌రిశీలించిన అనంత‌రం మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

మృతుల‌ను కృష్ణారెడ్డి, వరలక్ష్మి, వెంకటసాయిరెడ్డిగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తు కార‌ణంగా ప్ర‌మాదం జ‌రిగిందా..? శీతాకాలం కావ‌డంతో రహదారిపై పొగ మంచు ఎక్కువ‌గా ఉండ‌డంతో ప్ర‌మాదం జ‌రిగిందా..? అన్న కోణంలోనూ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story