ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అతివేగం, మద్యం మత్తు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో చాలా కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈఎస్‌ఐ హాస్పిటల్ లైన్ నుండి వస్తున్న వెర్ణా కారు అతి వేగంతో దూసుకుపోయింది. అతి వేగం కారణంగా ఓ స్కూటీని ఢీకొట్టిన కారు.. ఆ తర్వాత మరో బైక్‌ను ఢీ కొట్టింది. ఎస్‌ఆర్ నగర్ పోలీస్ పరిధిలో బీకే గూడ చౌరస్తా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘోర ప్రమాదంలో 8 నెలల చిన్నారికి కూడా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్నారు. కారును సీజ్ చేసిన పోలీసులు.. జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. కారు అతివేగంతో కాసేపు అక్కడ ఎం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అర్థరాత్రి సమయంలో ప్రయాణికులు ఎక్కువ మంది లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది. గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చూస్తున్నారు.