ల‌వ‌ర్స్‌పై గంజాయి బ్యాచ్ దాడి.. యువ‌కుడిని తాళ్ల‌తో బంధించి.. యువ‌తిపై అత్యాచార‌య‌త్నం

Cannabis Batch attack on lovers in Krishna District.ప్రేమ జంట పై గంజాయి మ‌త్తులో ఉన్న ఇద్దరు యువ‌కులు దాడి చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Oct 2022 12:46 PM IST
ల‌వ‌ర్స్‌పై గంజాయి బ్యాచ్ దాడి.. యువ‌కుడిని తాళ్ల‌తో బంధించి.. యువ‌తిపై అత్యాచార‌య‌త్నం

ప్రేమ జంట పై గంజాయి మ‌త్తులో ఉన్న ఇద్దరు యువ‌కులు దాడి చేశారు. వారి వ‌ద్ద నున్న డ‌బ్బు తీసుకున్నారు. అనంత‌రం ఆ యువ‌కుడిని తాళ్ల‌తో క‌ట్టేసి యువ‌తిపై అత్యాచార య‌త్నం చేశారు. ఈ ఘ‌ట‌న కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రంలో జ‌రిగింది.

ముస్తాబాద్‌లో ఓ ప్రేమ జంట నిర్మానుష్య ప్ర‌దేశానికి వెళ్ల‌డం గ‌మ‌నించిన ఇద్ద‌రు యువ‌కులు ఆటోలో వారిని వెంబ‌డించారు. అనంత‌రం ఓ చోట వారిపై దాడి చేశారు. వారి వ‌ద్ద నున్న డ‌బ్బులు లాక్కుకున్నారు. అనంత‌రం విడిచిపెట్టాల‌ని ప్రేమ జంట ప్రాధేయ‌ప‌డినా.. గంజాయి మ‌త్తులో ఉన్న వారు వినిపించుకోలేదు. ఆ యువ‌కుడిని తాళ్ల‌తో క‌ట్టేశారు.

అనంత‌రం యువ‌తిని ప‌క్క‌కు తీసుకువెళ్లి అత్యాచారం చేసేందుకు య‌త్నించారు. అయితే.. యువ‌తి గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో అటుగా వెలుతున్న స్థానికులు అక్క‌డ‌కు వెళ్లారు. స్థానికులు వ‌స్తుండ‌డంతో భ‌య‌ప‌డిన నిందితులు పారిపోయేందుకు య‌త్నించారు. తాము తీసుకువ‌చ్చిన ఆటోను అక్క‌డే వ‌దిలివేసి ప‌రుగు లంకించుకున్నారు. ఇద్ద‌రు నిందితుల్లో ఒక‌రిని స్థానికులు వెంబ‌డించి ప‌ట్టుకుని యువ‌తిని ర‌క్షించారు. అనంత‌రం పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు నిందితుల ఆటోను ప‌రిశీలించ‌గా అందులో గంజాయి ఉన్న‌ట్లు గుర్తించారు. బాధిత ప్రేమ‌జంట‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ఇద్ద‌రు నిందితుల్లో ఒక‌రిని అదుపులోకి తీసుకున్నారు. మ‌రొక‌రి కోసం గాలింపు చేప‌ట్టారు.

Next Story