అమ్మాయిల వలపు వల(హనీ ట్రాప్) మాయలో పడి ఎంతో మంది.. ఎన్నో రకాలుగా నష్టపోతూ ఉన్నారు. కొల్హాపూర్‌లో కూడా అలాంటి ఘటనే ఒకటి చేసుకుంది. అక్కడ హనీ ట్రాప్ కేసు నమోదైంది. స్థానిక వ్యాపారవేత్త ఒక మహిళ వలపు మాయలో పడి స్నేహం చేయడం తీవ్ర పరిణామాలకు దారి తీసింది. వ్యాపారవేత్త హనీ ట్రాప్‌లో చిక్కుకుని లక్షల్లో కాదు.. కోట్ల రూపాయలు సమర్పించుకున్నాడు. తన పరువును కాపాడుకోడానికి చాలానే ప్రయత్నాలు చేశారు. ఇంతలో అతని కొడుకు తన తండ్రి బాధను గమనించి పోలీసులకు సంప్రదించారు.
ఈ కేసులో మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. 2019 నుండి కొల్హాపూర్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త పని కోసం ముంబైకి వెళ్లి ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేశారు. ఇంతలో ఒక సిబ్బంది వ్యాపారవేత్తను హనీ ట్రాప్ చేశారు. తొలుత రూ.3.30 కోట్లు దోచుకోగా.. ఆ తర్వాత రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. కానీ చివరికి సదరు వ్యాపారవేత్త కుమారుడు వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో సప్నా, అనిల్, మోనికా అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ ఇంకా ఎంత మందిని ఇలా లోబరుచుకుందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.