రాజస్థాన్ లో దారుణం.. బస్సులో 8 మంది సజీవ దహనం
Bus catches fire in Rajasthan's Jalore.రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు కరెంట్ తీగను తాకడంతో బస్సులో 8 మంది సజీవ దహనం.
By తోట వంశీ కుమార్ Published on
17 Jan 2021 4:41 AM GMT

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు కరెంట్ తీగను తాకడంతో బస్సులో ప్రయాణిస్తున్న 8 మంది సజీవదహనం కాగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. బార్మెర్ నుంచి అజ్మీర్‌లోని బేవార్‌కు భక్తులతో బస్సు వెలుతోంది. మహేశ్‌పుర గ్రామంలోకి వచ్చిన సమయంలో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో.. బస్సు వేలాడుతున్న విద్యుత్తు తీగను తాకింది. వెంటనే మంటలు చెలరేగి బస్సును చుట్టుముట్టాయి.
గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని జోధ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Next Story