ఆరేపల్లిలో రైలు నుండి దూకి.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Btech student commits suicide in Telangana. బీటెక్‌ విద్యార్థిని రైలు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని

By అంజి
Published on : 3 Feb 2022 3:23 PM IST

ఆరేపల్లిలో రైలు నుండి దూకి.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

బీటెక్‌ విద్యార్థిని రైలు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుండి వెళ్లిన ఆ యువతి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. యువతి ఆత్మహత్య విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విద్యార్థిని శ్రీ వర్ష హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతోంది. ఆమె స్వస్థలం గద్వాల జిల్లా నల్లగుంట. బుధవారం నాడు కళాశాలకు వెళ్లేందుకు గద్వాల నుండి బయల్దేరింది.

ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ.. వనపర్తి జిల్లాలోని ఆరేపల్లి దగ్గర రైలులో నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఇక మరో ఘటనలో హైదరాబాద్‌ నగరంలో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బత్తిని సోహన్‌ సిద్ధ అనే బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్మకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story