భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళ మిస్సింగ్ కేస్ సంచలంగా మారింది. ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి గోనె బస్తాలో వేసి పొలంలో పూడ్చి పెట్టాడు ఆమె ప్రియుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో స్వాతి అనే మహిళ ఒక షాపింగ్ మాల్‌లో పనిచేస్తుంది. గత మూడు రోజుల క్రితం నుండి స్వాతి కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వాతి ప్రియుడు వీరభద్రం ఆమెను చంపి గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టాడు.
గతంలో ఈ ప్రేమ జంట సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ కుటుంబాన్ని మోసం చేసింది. వారి దగ్గర నుండి రూ. 16 లక్షలు కూడా తీసుకున్నారు. ఉద్యోగం రాకపోవడంతో మోసపోయామని తీవ్ర మనస్థాపానికి గురైన ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ 16 లక్షల విషయంలో స్వాతి, వీరభద్రంకు మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. దీంతో స్వాతిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. పథకం ప్రకారమే స్వాతిని గత మూడు రోజుల క్రితం బయటకు తీసుకువెళ్లి అతి దారుణంగా హత్య చేసి పొలంలో పాతిపెట్టాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.