బంధాలే తలదించుకునే దారుణం.. సోదరుడే..!

Brother sexual assault sister in Rajasthan. బంధాలు, అనుబంధాలు, వావి వరసలు ఉంటాయి కాబట్టే మనుషులకు, పశువులకు ఈ ప్రపంచంలో తేడా ఉంటుంది. అలాంటి వాటిని

By M.S.R  Published on  4 Jan 2022 4:00 PM GMT
బంధాలే తలదించుకునే దారుణం.. సోదరుడే..!

బంధాలు, అనుబంధాలు, వావి వరసలు ఉంటాయి కాబట్టే మనుషులకు, పశువులకు ఈ ప్రపంచంలో తేడా ఉంటుంది. అలాంటి వాటిని పట్టించుకోకుండా కామవాంఛలు తీర్చుకోడానికి ప్రయత్నిస్తే మనిషి జాతికే కళంకం. అలాంటి ఘటనే రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌ లో చోటు చేసుకుంది. సోదరుడు తన సొంత సోదరిని రేప్ చేశాడు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇంట్లో ఉన్న బాలికపై ఆమె దత్తత సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలి తండ్రి ఇరవై ఏళ్ల క్రితం నిందితుడిని దత్తత తీసుకున్నట్లు సమాచారం. బాధితురాలి తండ్రి చనిపోవడంతో తల్లి మరో పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి కుటుంబంతో విడివిడిగా ఉంటూ.. టెంపో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. నిందితుడు సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో బాధితురాలి ఇంటికి చేరుకున్నారు. తండ్రి చనిపోవడంతో బాధితురాలు తల్లితో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. అయితే నిందితుడు ఇంటికి వచ్చేసరికి అతని తల్లి ఇంట్లో లేదు. బాధితురాలు అతడికి తెలుసు కాబట్టి అతడిని ఇంటి లోపలికి ఆహ్వానించింది. బాధితురాలిపై అక్కడికక్కడే అత్యాచారం చేశాడు. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

బయటకు వెళ్లిన బాధితురాలి తల్లి ఇంటికి తిరిగి వచ్చి బాలికను ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారం అందించింది. బాధితురాలి తల్లి అందించిన సమాచారం మేరకు మహిళా ఠాణా పోలీసులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. రాత్రి సోదాలు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మహిళా ఠాణా సీఐ రాజేష్ రాణి తెలిపారు. పోలీసులు ఇంకా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it