గోవాలో బ్రిటన్ మహిళపై అత్యాచారం

British woman on holiday with husband raped at north Goa beach. ఉత్తర గోవాలోని అరాంబోల్ స్వీట్ వాటర్ బీచ్‌లో గత వారం బ్రిటన్ మహిళపై

By Medi Samrat  Published on  7 Jun 2022 4:23 PM IST
గోవాలో బ్రిటన్ మహిళపై అత్యాచారం

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. ఉత్తర గోవాలోని అరాంబోల్ స్వీట్ వాటర్ బీచ్‌లో గత వారం బ్రిటన్ మహిళపై అత్యాచారం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 32 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు స్థానికుడని పోలీసులు మీడియాకు తెలిపారు. జూన్ 2న బీచ్‌లో బ్రిటీష్ మహిళ విశ్రాంతి తీసుకుంటున్నట్లు గమనించిన నిందితుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

తన భర్తతో కలిసి హాలీడే ట్రిప్ కోసం గోవాలో ఉన్న బాధితురాలు.. సోమవారం (జూన్ 6) జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదే రోజు పట్టుకున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.













Next Story