ఉద‌యం పెళ్లి.. సాయంత్రం న‌వ వ‌ధువు ఆత్మ‌హ‌త్య‌

Bride committed suicide in Mahabubnagar.పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు. పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2022 10:52 AM IST
ఉద‌యం పెళ్లి.. సాయంత్రం న‌వ వ‌ధువు ఆత్మ‌హ‌త్య‌

పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు. పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో అంద‌మైన వేడుక అవుతుంది. అయితే.. త‌న‌కు ఇష్టం లేని పెళ్లి చేశార‌ని ఓ న‌వ వ‌ధువు దారుణ నిర్ణ‌యం తీసుకుంది. ఉద‌యం వివాహాం జ‌రుగ‌గా.. సాయంత్రం విషం తాగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ విషాద ఘ‌ట‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పట్టణానికి చెందిన గుజ్జల పద్మకు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు లక్ష్మి(19) ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకుంది. ఇంటి వ‌ద్దే ఉంటూ త‌ల్లికి సాయం చేస్తోంది. ఇటీవ‌ల ల‌క్ష్మీకి అనంత‌పురం జిల్లాకు చెందిన మ‌ల్లికార్జున్‌తో వివాహాన్ని నిశ్చ‌యించారు. అయితే.. అంత‌దూరం వెళ్ల‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని, ఈ వివాహం వ‌ద్ద‌ని ల‌క్ష్మీ..త‌న త‌ల్లికి చెప్పింది. అయితే.. ఆమె మాట‌ల‌ను పెద్ద‌లు వినిపించుకోలేదు. శుక్ర‌వారం ఉద‌యం వివాహాన్ని జ‌రిపించారు.

సాయంత్రం స‌మ‌యంలో బాత్రూమ్‌లోకి వెళ్లిన ల‌క్ష్మీ విషం తాగింది. ఎంత‌కీ ఆమె బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు వెళ్లి చూడ‌గా.. అప‌స్మార‌క స్థితిలో క‌నిపించింది. వెంట‌నే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించగా.. అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. న‌వ వ‌ధువు మృతితో ఇరుకుటుంబాల్లో విషాదం నెల‌కొంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story