ప్రేమకు అడ్డొస్తుందని యువతి తల్లిని నడి వీధిలో చంప‌బోయాడు..!

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారంలో ఓ యువతి వెంటపడి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్న యువకుడు ఆమె తల్లిని హత్య చేసేందుకు యత్నించాడు

By Medi Samrat  Published on  2 March 2025 6:20 PM IST
ప్రేమకు అడ్డొస్తుందని యువతి తల్లిని నడి వీధిలో చంప‌బోయాడు..!

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారంలో ఓ యువతి వెంటపడి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్న యువకుడు ఆమె తల్లిని హత్య చేసేందుకు యత్నించాడు. గ్రామస్తుల కథనం ప్రకారం అదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి ఓ మహిళను వేధిస్తూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్‌కుమార్ యువతి తల్లిపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు. ఇరుగుపొరుగు వారు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను రక్షించారు. రాజ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తన ప్రేమకు అడ్డు వస్తోంది అనే కోపంతో గ్రామంలోని నడి వీధిలో యువతి తల్లి చామంతిని తీవ్రంగా కొట్టి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు. బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్ కుమార్ ను పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించినట్లు ఎస్సై వి.శేఖర్ తెలిపారు.


Next Story