దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కనికరం లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు దుండగులు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళ ఒంటరిగా కనిపించడమే పాపమైపోతోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలోని ఒక గ్రామంలో విషాధ ఘటన చోటు చేసుకుంది. కనిపించకుండా పోయిన 13 ఏళ్ల బాలిక యొక్క నగ్న మృతదేహం లభ్యమైంది. మృతదేహం లభ్యం కావడంతో హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం జాన్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డియోరీ గ్రామానికి చెందిన చిన్నారి కనిపించకుండా పోయింది.
దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ వెంటనే బాలిక కోసం కుటుంబ సభ్యులు వెతకసాగారు. ఈ క్రమంలోనే బాలిక కనిపించకుండా పోయిన రోజు సాయంత్రం 7 గంటలకు సమీపంలోని పొలంలో ఆమె నగ్న మృతదేహాన్ని గుర్తించినట్లు సబ్ డివిజనల్ అధికారి తెలిపారు. ఈ విషయాన్ని పోలీసు భవిష్య భాస్కర్ తెలిపారు. హత్య కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ ముఖేష్ వైష్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత బాలిక ఎలా హత్య గురైందో తెలియనుంది. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.