నిర్మల్ లోని బంగల్‌పేట ప్రాంతంలో నవజాత శిశువు మృతదేహాన్ని చెత్తకుండీలో పడేశారు. బంగల్‌పేటలో ఉదయం చెత్తను ఎత్తివేస్తుండగా చెత్తకుండీలో పాలిథిన్ కవర్‌లో చుట్టి ఉన్న బాలిక మృతదేహాన్ని పారిశుధ్య కార్మికులు గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. పెళ్లి చేసుకోకుండా బిడ్డకు జన్మనిచ్చినందుకు ఎవరో మహిళ మృతదేహాన్ని పారేసి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.
నందిగామలో:
కంచికచర్లలో రాజ్యలక్ష్యి గ్యాస్ కంపెనీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును చెత్తకుండీలో వదిలి వెళ్లారు. పాప కేకలు వినిపించడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు. శిశువు ఒంటిపై చీమలు, పురుగులు పట్టి ఉంది. ఆ శిశువును ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పాప తక్కువ బరువుతో జన్మించిందని వైద్యులు తెలిపారు.