స్కూల్ టాయ్ లెట్ లో సంవత్సరం వయసున్న బాలిక శవం

Body of 1-year-old girl found in school toilet. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని సైర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాల టాయిలెట్‌లో

By Medi Samrat  Published on  14 May 2022 8:00 PM IST
స్కూల్ టాయ్ లెట్ లో సంవత్సరం వయసున్న బాలిక శవం

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని సైర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాల టాయిలెట్‌లో ఏడాది వయసున్న బాలిక మృతదేహం లభ్యం కావడంతో ఆ ప్రాంతంలో సంచలనం రేగింది. ఈ ఘటన జుగౌర్ గ్రామంలో చోటుచేసుకుంది. బాలిక కాలికి ఇటుకను కట్టడంతో ఇది హత్య అనే ఆందోళనలు ఎక్కువయ్యాయి. కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.

శుక్రవారం ఉదయం సైర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో బాలిక తప్పిపోయిందని కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించగా.. ఇద్దరు మైనర్ బాలురు తమతో పాటు బాలికను పాఠశాలకు తీసుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు పాఠశాలలో వెతకగా టాయిలెట్‌లోని వాటర్ ట్యాంక్‌లో బాలిక మృతదేహం పడి ఉందని గుర్తించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నీటిలో మునిగిపోవడం వల్లే బాలిక చనిపోయిందని నివేదిక వెల్లడించింది. నివేదిక అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించి, అనంతరం బాలికకు అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రస్తుతం పోలీసులు హత్య కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించారు. బాలికను తమ వెంట తీసుకెళ్లిన మైనర్‌ బాలురు ఎవరో కూడా ఆరా తీస్తున్నారు. మృతదేహం పైకి రాకుండా బాలిక కాలుపై ఇటుకను బిగించారు.













Next Story