బీఎండబ్ల్యూ కారేసుకుని.. ఏకంగా పోలీసు మీదకే..

BMW owner booked for running over traffic cop in Bhopal. భోపాల్ లోని టీటీ నగర్ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ మీదకు బీఎండబ్ల్యూ

By Medi Samrat  Published on  21 March 2022 6:17 AM GMT
బీఎండబ్ల్యూ కారేసుకుని.. ఏకంగా పోలీసు మీదకే..

భోపాల్ లోని టీటీ నగర్ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ మీదకు బీఎండబ్ల్యూ కారును వేసుకొని వెళ్లాడు ఓ వ్య‌క్తి. ఆ డ్రైవర్ కావాలనే ఢీకొట్టాడని పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎండబ్ల్యూ డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేదు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ అధికారి వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కారు దిగి వాగ్వాదానికి దిగాడు. తీవ్ర వాగ్వాదం తరువాత, నిందితుడు తన కారులో ఎక్కి, కానిస్టేబుల్‌ను ఢీకొట్టి సంఘటనా స్థలం నుండి పారిపోయాడు.

బీఎండబ్ల్యూ నడుపుతున్న వ్యక్తి ఎవరో తెలియనప్పటికీ, వాహనం లైసెన్స్ ప్లేట్ నంబర్ ఆధారంగా అతనిపై టిటి నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. TT నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ చైన్ సింగ్ రఘువంశీ మాట్లాడుతూ, ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని సంబంధిత సెక్షన్‌ల కింద కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని, అతని కోసం వెతుకుతున్నామని చెప్పారు.
Next Story
Share it