బీజేపీ సీనియర్ నేత ఇంటి బయట భారీ పేలుడు
పంజాబ్‌లోని జలంధర్‌లో బీజేపీ నేత మనోరంజన్ కాలియా ఇంటి బయట పేలుడు సంభవించింది.
By Medi Samrat
పంజాబ్‌లోని జలంధర్‌లో బీజేపీ నేత మనోరంజన్ కాలియా ఇంటి బయట పేలుడు సంభవించింది. పేలుడు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. ఘటన జరిగిన సమయంలో మాజీ మంత్రి మనోరంజన్ కాలియా తన ఇంట్లో నిద్రిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు.
వార్తా సంస్థ ANI ప్రకారం.. జలంధర్‌లోని బిజెపి నాయకుడు మనోరంజన్ కాలియా ఇంటి వెలుపల పేలుడు సంభవించింది. రాత్రి 1 గంట ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడు సమాచారం అందిన వెంటనే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
సీసీటీవీని పరిశీలించగా.. నిందితుల్లో ఒకరు ఈ-రిక్షా దిగి హ్యాండ్ గ్రెనేడ్ లివర్ తీసి మాజీ మంత్రి ఇంట్లోకి విసిరినట్లు తేలింది. అనంతరం భారీ పేలుడు సంభవించింది. మాజీ మంత్రి ఇంట్లో జరిగిన పేలుడులో భారీ నష్టం జరిగింది.
జలంధర్ పోలీస్ కమిషనర్ ధన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. రాత్రి ఒంటి గంట సమయంలో ఇక్కడ పేలుడు గురించి మాకు సమాచారం అందిందని, ఆ తర్వాత మేము సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాము. ఉరుము తరహా శబ్దం వినిపించిందని బీజేపీ నేత మనోరంజన్ కాలియా తెలిపారు.
బీజేపీ నాయకుడు మాట్లాడుతూ.. "రాత్రి ఒంటి గంటకు పేలుడు జరిగింది.. నేను నిద్రపోతున్నాను.. ఉరుము శబ్దం అని నేను అనుకున్నాను, తరువాత పేలుడు సంభవించిందని నాకు తెలిసింది.. ఆ తర్వాత నేను నా గన్‌మ్యాన్‌ను పోలీస్ స్టేషన్‌కు పంపాను. సిసిటివి తనిఖీ చేయబడింది. ఓ వ్యక్తి ఈ-రిక్షాలో వచ్చి హ్యాండ్ గ్రెనేడ్ లీవర్ తీసి ఇంటిపై విసిరినట్లు సీసీటీవీ విచారణలో తేలింది. అనంతరం భారీ పేలుడు సంభవించిందని పేర్కొన్నారు.
జలంధర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మన్‌ప్రీత్ సింగ్ ఈ సంఘటనను ధృవీకరించారు. మనోరంజన్ కాలియా నివాసంలో ఈ సంఘటన జరిగిందని చెప్పారు. పంజాబ్ మాజీ కేబినెట్ మంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు మనోరంజన్ కాలియాకు పంజాబ్ ప్రభుత్వం నలుగురు గన్‌మెన్‌లను కేటాయించింది.
కాలియా సెక్యూరిటీ ఇంచార్జి నిషాన్ సింగ్. రాత్రిపూట సెక్యూరిటీ అతని గదిలోనే ఉంటారు. రాత్రి ఒంటి గంట తర్వాత ఈ ఘటన జరిగినట్లు సీసీటీవీలో నమోదైంది. కాలియా కి కోఠి నగరం మధ్యలో ఉంది. పోలీస్ స్టేషన్ ఒక నిమిషం దూరం నడిచి వెళ్లేంత దగ్గరలో ఉంది.