నడి రోడ్డుపై బీజేపీ నేత దారుణ‌ హత్య

BJP leader stabbed to death in Viramgam. అహ్మదాబాద్ పట్టణంలోని భూపత్ క్రాస్‌రోడ్స్ సమీపంలోని కొఠారి వంతెనపై 45 ఏళ్ల స్థానిక బీజేపీ నాయకుడిని

By M.S.R  Published on  11 Jan 2023 6:02 PM IST
నడి రోడ్డుపై బీజేపీ నేత దారుణ‌ హత్య

అహ్మదాబాద్ పట్టణంలోని భూపత్ క్రాస్‌రోడ్స్ సమీపంలోని కొఠారి వంతెనపై 45 ఏళ్ల స్థానిక బీజేపీ నాయకుడిని ఇద్దరు గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. విరామ్‌గాం పట్టణ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హర్షద్ గమోత్ బీజేపీ నాయకుడిగా మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. అతని భార్య విరామ్‌గాం మున్సిపాలిటీలో కౌన్సిలర్. గమోత్ తన మోటార్‌సైకిల్‌పై ఇంటికి వెళుతుండగా, ఓ SUV వచ్చి అతన్ని గుద్దింది. ఇద్దరు వ్యక్తులు కారు దిగి.. వారిలో ఒకరు గమోత్ ను పట్టుకోగా, మరొకరు కత్తితో పొడిచారు. రక్తపు మడుగులో ఉన్న హర్షద్ ను చూసి స్థానికులు అంబులెన్స్‌కు కాల్ చేశారు. తడి ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

పాత శత్రుత్వంతో మరో స్థానిక నాయకుడు ఈ హత్యకు పథకం వేసి అమలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. హర్షద్ భార్య అభ్యర్థిత్వంపై గత ఏడాది కాలంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. విరామగాం పట్టణ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై హత్య, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని కూడా పిలిచినట్లు పోలీసు అధికారి తెలిపారు.


Next Story