బీజేపీ నేత దారుణ హ‌త్య‌

BJP Leader Murdered in Khammam. ఖమ్మం జిల్లా వైరాలో దారుణం చోటుచేసుకుంది. వైరా బీజేపీ నాయ‌కుడు నేలవెళ్లి రామారావుపై

By Medi Samrat  Published on  26 Dec 2020 4:42 AM GMT
బీజేపీ నేత దారుణ హ‌త్య‌

ఖమ్మం జిల్లా వైరాలో దారుణం చోటుచేసుకుంది. వైరా బీజేపీ నాయ‌కుడు నేలవెళ్లి రామారావుపై హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తెల్లవారుజామున ఆయనపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేలవెళ్లి రామారావు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి ఘటనపై విచారణ చేపట్టారు. హ‌త్య‌కు ఆర్థిక లావాదేవీలే కారణమ‌ని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఘ‌ట‌న‌కు సంబందించి పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.


Next Story
Share it