దేశ రాజ‌ధానిలో బీజేపీ నేత దారుణ హత్య‌.. ఇంటి ముందే నాలుగు రౌండ్ల కాల్పులు

BJP leader Jitu Chaudhary shot dead in Mayur Vihar.దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. భార‌తీయ జ‌న‌తా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 April 2022 8:42 AM IST
దేశ రాజ‌ధానిలో బీజేపీ నేత దారుణ హత్య‌.. ఇంటి ముందే నాలుగు రౌండ్ల కాల్పులు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) నేతను అత‌డి నివాసం ముందే గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్చి చంపారు. మ‌యూర్ విహార్ ప్రాంతంలో బుధ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. జ‌హంగీర్ పురిలో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను ఎన్‌డీఎంసీ అధికారులు కూల్చివేసిన మ‌రుస‌టి రోజు ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

వివ‌రాల్లోకి వెళితే 42 ఏళ్ల జీతూ చౌదరి.. మ‌యూర్ విహార్ జిల్లా బీజేపీ యూనిట్‌కి సెక్ర‌ట‌రీగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. బుధ‌వారం రాత్రి 8.15 గంట‌ల స‌మ‌యంలో త‌న ఇంటి ముందు నిలుచున్నాడు. అదే స‌మ‌యంలో బైక్‌పై వ‌చ్చిన గుర్తు తెలియ‌ని దుండ‌గులు జీతూ చౌద‌రిపై నాలుగు రౌండ్లు కాల్పులు జ‌రిపారు. జీతూ చౌద‌రి త‌ల‌, క‌డుపు భాగాల్లోకి బుల్లెట్లు దూసుకువెళ్లాయి. గ‌స్తీ నిర్వ‌హిస్తున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. తీవ్ర‌గాయాల‌తో ప‌డి ఉన్న జీతూ చౌద‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అత‌డు అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు.

దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఘటనా స్థలంలో ఖాళీగా ఉన్న కాట్రిజ్‌లు, ఇతర ఆధారాలను సేకరించామన్నారు. సీసీటీవీ పుటేజ్‌ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు చెప్పారు. కాగా.. ఎందుకు కాల్పులు జ‌రిపారు అన్న సంగ‌తి తెలియాల్సి ఉంది.

Next Story