హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ బైక్ రేసర్ వీరంగం సృష్టించడమే కాకుండా పోలీస్ కానిస్టేబుల్‌పై బీరు సీసాతో తలపై దాడి చేశారు. వేగం దూసుకెళ్లి ఓ కారును ఢీకొట్టడమే కాకుండా.. అడ్డు వచ్చిన పోలీస్ కానిస్టేబుల్‌పై బీర్ సీసాతో దాడి చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. టోలి చౌకీ నుంచి వేగంగా దూసుకొస్తున్న బైక్ రేసర్ ఖాజా బంజారాహిల్స్‌లోని ఒమేగా హాస్పిటల్ వద్ద కారును ఢీకొట్టాడు. దీంతో కార్ డ్రైవర్, ఖాజా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇదే సమయంలో బంజారాహిల్స్ పీఎస్‌లో డ్యూటీ నిమిత్తం అదే రూట్లో వెళ్తోన్న కానిస్టేబుల్ శ్రీకాంత్ ఇద్దరినీ వారించే ప్రయత్నం చేశాడు. ఆగ్రహానికి గురైన బైక్ రైడర్ ఖాజా బీర్ బాటిల్‌తో కానిస్టేబుల్ శ్రీకాంత్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ శ్రీకాంత్‌ను పోలీసులు ఆసుప్రతికి తరలించారు. ఖాజాపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ శ్రీకాంత్ ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న కానిస్టేబుల్ శ్రీకాంత్‌ను వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ పరామర్శించారు.