పోలీసు స్టేషన్ ముందు పార్క్ చేసిన బైక్‌నే కొట్టేశారు..!

ఎక్కడో మారు మూలన ఉన్న ప్రాంతంలో బైక్ మాయమైతే ఏమైనా అనుకోవచ్చు కానీ.. ఏకంగా పోలీసు స్టేషన్ ముందు ఉన్న బైక్ మాయమైతే అది కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు

By Medi Samrat  Published on  7 Aug 2024 7:40 PM IST
పోలీసు స్టేషన్ ముందు పార్క్ చేసిన బైక్‌నే కొట్టేశారు..!

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ఎక్కడో మారు మూలన ఉన్న ప్రాంతంలో బైక్ మాయమైతే ఏమైనా అనుకోవచ్చు కానీ.. ఏకంగా పోలీసు స్టేషన్ ముందు ఉన్న బైక్ మాయమైతే అది కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు. అచ్చం అలానే.. మెదక్ పోలీసు స్టేషన్ ముందు ఉన్న బైక్ ను కొట్టేయడంపై ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది.

మెదక్ పోలీస్ స్టేషన్‌ లోపలికి వెళ్లిన ఓ వ్యక్తి తన బైక్‌ను స్టేషన్ బయట పార్క్ చేశాడు.. అతడు బయటకు వచ్చిన తర్వాత తన వాహనం చోరీకి గురైనట్లు గుర్తించాడు. గంటాజీ గంగాధర్ బుధవారం మధ్యాహ్నం ఏదో సమస్యపై పోలీసులను కలిసేందుకు తన స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. గంట తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అతను తన బైక్ కనిపించడం లేదని గుర్తించాడు. పట్టపగలు బైక్‌ను ఎత్తుకెళ్లడంపై గంగాధర్‌తో పాటు పోలీసులు కూడా షాక్ అయ్యారు. బైక్‌ను ఎవరు ఎత్తుకెళ్లారనే దానిపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Next Story