దొంగగా మారిన ఐటీ ఉద్యోగిని.. ఎందుకంటే.?

బెంగళూరులో పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహాల నుంచి రూ. 10 లక్షలకు పైగా విలువైన 24 ల్యాప్‌టాప్‌లను దొంగిలించినందుకు 26 ఏళ్ల అమ్మాయిని అరెస్టు చేశారు

By Medi Samrat  Published on  29 March 2024 2:16 PM GMT
దొంగగా మారిన ఐటీ ఉద్యోగిని.. ఎందుకంటే.?

బెంగళూరులో పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహాల నుంచి రూ. 10 లక్షలకు పైగా విలువైన 24 ల్యాప్‌టాప్‌లను దొంగిలించినందుకు 26 ఏళ్ల అమ్మాయిని అరెస్టు చేశారు. ఆమె గతంలో ఐటీ ఉద్యోగినిగా పని చేసింది. నిందితురాలు జాస్సీ అగర్వాల్ ఉద్యోగం కోసం నోయిడా నుంచి బెంగళూరుకు వెళ్లింది. కోవిడ్ సమయంలో ఆమె ఉద్యోగం కోల్పోయింది. ఆ తర్వాత పీజీల నుంచి ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్‌లను దొంగిలించడం ప్రారంభించి బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించింది. జాస్సీ ఖాళీగా ఉన్న గదుల్లోకి ప్రవేశించి ఛార్జింగ్ పెట్టిన ల్యాప్‌టాప్‌లను దొంగిలించేది.

చాలా ల్యాప్‌టాప్‌లు మాయమైనట్లు పీజీ ఓనర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మార్చి 26న ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు రూ.10-15 లక్షలకు పైగా విలువైన 24 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. "జెస్సీ చాలా ప్రాంతాల్లో ఇలాంటి పనులు చేస్తోంది. ఇది గత కొంతకాలంగా జరుగుతోంది. ఆమె పీజీల్లోకి వెళ్లి దొంగిలించిన గాడ్జెట్‌లతో వెళ్లిపోయిన సీసీటీవీ విజువల్స్‌ను మా క్రైమ్ బ్రాంచ్ భద్రపరిచింది’’ అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Next Story