షాకింగ్.. విద్యార్థినిపై లెక్చ‌రర్లు అత్యాచారం

కర్నాటకలోని బెంగళూరులో ఓ కాలేజీ లెక్చ‌ర‌ర్ విద్యార్థినిపై పదేపదే అత్యాచారం చేసిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది

By Medi Samrat
Published on : 15 July 2025 7:16 PM IST

షాకింగ్.. విద్యార్థినిపై లెక్చ‌రర్లు అత్యాచారం

కర్నాటకలోని బెంగళూరులో ఓ కాలేజీ లెక్చ‌ర‌ర్ విద్యార్థినిపై పదేపదే అత్యాచారం చేసిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫిజిక్స్, బయాలజీ బోధించే లెక్చరర్‌తో పాటు అతని స్నేహితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర, బయాలజీ లెక్చరర్ సందీప్, అనూప్‌లుగా గుర్తించారు. ముగ్గురు విద్యార్థి చదువుతున్న ప్రైవేట్ కళాశాలలోనే పనిచేశారు.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఫిజిక్స్ బోధించే నరేంద్ర.. నోట్స్ షేరింగ్ పేరుతో విద్యార్థిని సంప్రదించగా.. మెసేజ్ సంభాషణ తర్వాత వారిద్దరూ స్నేహితులయ్యారు. ఆ తర్వాత బాధితురాలిని బయాలజీ బోధించే అనూప్ గదికి పిలిపించిన నరేంద్ర, అక్కడ ఆమెపై అత్యాచారం చేసి.. ఈ విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు బాగోవని బెదిరించాడు. కొన్ని రోజుల తర్వాత సందీప్ ఆమెను వేధించాడు. ఆమె నిరసన వ్యక్తం చేయడంతో.. సందీప్‌ ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. మీ ఫోటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని బెదిరించాడు. ఆపై అనూప్ గదిలో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ త‌ర్వాత తన గదిలోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజీ ఉందని, అనూప్ బ్లాక్ మెయిల్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు రాష్ట్ర మహిళా కమిషన్‌ను సంప్రదించి మారతహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ జరుగుతోంది.

Next Story