వీధుల్లో నడుస్తున్న మహిళలే టార్గెట్‌.. వెనుక‌ నుంచి ఫోటోలు, వీడియోలు తీయ‌డం.. వాటిని

బహిరంగ ప్రదేశాల్లో మహిళల అనుమతి లేకుండా వారిని చిత్రీకరించి, ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశాడనే ఆరోపణలతో బెంగళూరు లోని అశోక్‌నగర్ పోలీసులు 19 ఏళ్ల ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను అరెస్టు చేశారు.

By Medi Samrat
Published on : 24 July 2025 8:30 PM IST

వీధుల్లో నడుస్తున్న మహిళలే టార్గెట్‌.. వెనుక‌ నుంచి ఫోటోలు, వీడియోలు తీయ‌డం.. వాటిని

బహిరంగ ప్రదేశాల్లో మహిళల అనుమతి లేకుండా వారిని చిత్రీకరించి, ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశాడనే ఆరోపణలతో బెంగళూరు లోని అశోక్‌నగర్ పోలీసులు 19 ఏళ్ల ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను అరెస్టు చేశారు.

నిందితుడిని మణిపూర్‌కు చెందిన దిలావర్ హుస్సేన్ గా గుర్తించారు. ప్రస్తుతం బెంగళూరులో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. పోలీసుల సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ "దిల్బార్ జానీ-67" అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలించిన తర్వాత అతన్ని అరెస్టు చేశారు. ఈ ఖాతాలో అసభ్యకరమైన, రెచ్చగొట్టే వీడియోలు ఉన్నాయని గుర్తించారు. బెంగళూరు వీధుల్లో నడుస్తున్న మహిళల వెనుక నుండి చిత్రీకరించిన వీడియోలను అప్లోడ్ చేయడమే దిలావర్ పనిగా తెలుస్తోంది.

Next Story