బెంగాల్‌లోని కోల్‌కతాలోని ఎక్బాల్‌పూర్ ప్రాంతంలో విద్యుత్ తీగ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ కేబుల్‌పై బట్టలు ఆరేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతను విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతని భార్య, అత్త అతనికి సహాయం చేయడానికి ముందుకురాగా.. ఇద్దరు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. ముగ్గురిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. తల్లీ, కూతురు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇజార్ అఖ్తర్ తన తడి బట్టలు ఆరవేస్తుండగా గోడకు అతికించిన లోహపు తీగ ద్వారా విద్యుత్ ప్రవాహం ప్రవహించడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఎక్బాల్‌పూర్ నర్సింగ్ హోమ్‌లో చేర్చారు. ఆ వ్యక్తిని కాపాడే క్రమంలో విద్యుదాఘాతానికి గురైన తల్లీకూతుళ్లు కూడా మృతి చెందారు. వారిని కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించగా, అక్కడ వారు చనిపోయినట్లు ప్రకటించారు. మృతులను ఇజార్ అక్తర్, ముంతహా బేగం, ఖైరుల్ నెస్సాగా గుర్తించారు. కోల్‌కతాలోని ఎక్బాల్‌పూర్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.