ఇంజనీరింగ్ అమ్మాయితో మఠాధిపతి హానీ ట్రాప్.. సంచలన విషయాలు వెల్లడి
Basavalingeshwara was reportedly honey-trapped and blackmailed. కంచుగల్ బండే మఠానికి చెందిన లింగాయత్ పీఠాధిపతి బసవలింగేశ్వర స్వామి ఆత్మహత్యకు
By Medi Samrat Published on 30 Oct 2022 2:45 PM GMTకంచుగల్ బండే మఠానికి చెందిన లింగాయత్ పీఠాధిపతి బసవలింగేశ్వర స్వామి ఆత్మహత్యకు సంబంధించి 21 ఏళ్ల యువతి, సహా ముగ్గురిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. రామనగర పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ బాబు మాట్లాడుతూ అరెస్టు చేసిన వారిని నీలాంబిక, కన్నూర్ మఠాధిపతి మృత్యుంజయ స్వామి, రిటైర్డ్ టీచర్ మహదేవయ్యగా గుర్తించామని తెలిపారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, బసవలింగేశ్వర స్వామిని హనీట్రాప్ చేసి, ఆపై డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థిని అని చెప్పబడుతున్న నీలాంబికే బసవలింగేశ్వర స్వామికి సన్నిహితంగా ఉండేదని వారు తెలిపారు.
బసవలింగేశ్వర (44) అక్టోబర్ 24 తెల్లవారుజామున బెంగళూరుకు 50 కిలోమీటర్ల దూరంలోని రామనగర జిల్లా మాగడి తాలూకాలోని మఠంలోని తన గదిలో ఉరి వేసుకుని కనిపించారు. బసవలింగేశ్వర స్వామి, మృత్యుంజయ స్వామి బంధువులేనని పోలీసులు తెలిపారు. కొన్ని విభేదాల కారణంగా హానీ ట్రాప్ కు మృత్యుంజయ వర్గం పాల్పడిందని పోలీసులు చెప్పారు.
లింగాయత్ పీఠాధిపతి బసవలింగేశ్వర ఆత్మహత్య ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. ఒక మహిళ తన వీడియో కాల్స్ తో ఆయనను బ్లాక్ మెయిల్ చేసిందని గతంలోనే పోలీసులు చెప్పారు. ఒక మహిళతో పీఠాధిపతి ప్రైవేట్ మూమెంట్స్ ను మరో మహిళ తన ఫోన్ లో రికార్డ్ చేసిందని.. ఇదే విషయాన్ని సదరు పీఠాధిపతి తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారని చెప్పారు. కర్ణాటకలోని రామనగర జిల్లాలోని కంచుగల్ బండే మఠంలో తన ప్రార్థనా గదిలో పీఠాధిపతి బసవలింగ స్వామి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన్ను పీఠాధిపతి స్థానం నుంచి తొలగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని సూసైడ్ లో ఆయన పేర్కొన్నారు. కొందరు పీఠాధిపతులకు రాజకీయ నాయకులతో బలమైన పరిచయాలు ఉన్నాయని, వీరు ఇతర పీఠాధిపతులను దెబ్బతీసేలా వ్యవహరిస్తుంటారని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన పీఠాధిపతి 20 ఏళ్ల వయసులోనే మఠాధిపతిగా బాధ్యతలను స్వీకరించారు. 1997లో బాధ్యతలను స్వీకరించారు.