ఈ గ్యాంగ్‌కు లగేజీ బ్యాగ్ కనిపిస్తే చాలు..!

రైల్వే స్టేషన్లలో రద్దీ సమయాల్లో లగేజీ బ్యాగ్ లు కనిపిస్తే చాలు.. ఈ గ్యాంగ్ లేపేస్తారు.

By Medi Samrat
Published on : 8 July 2025 8:30 PM IST

ఈ గ్యాంగ్‌కు లగేజీ బ్యాగ్ కనిపిస్తే చాలు..!

రైల్వే స్టేషన్లలో రద్దీ సమయాల్లో లగేజీ బ్యాగ్ లు కనిపిస్తే చాలు.. ఈ గ్యాంగ్ లేపేస్తారు. రద్దీ సమయాల్లో సీసీటీవీలో కనిపించకుండా ఉండటానికి, రద్దీ సమయాల్లో బట్టల వ్యాపారులుగా నటిస్తూ మోసం చేస్తున్న ప్రొఫెషనల్ బ్యాగ్ లిఫ్టర్ల ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ లోని నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

అమిత్ కుమార్ (37), కరణ్ కుమార్ (27), గౌరవ్ (33), పునీత్ మహతో (38), రైళ్లు ఎక్కే, దిగే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగించే వారు. ముఖ్యంగా రద్దీగా ఉండే స్టేషన్లలో దొంగిలించిన బ్యాగులను పోలిన వాటితో భర్తీ చేస్తూ ఉండేవారు. "జూలై 3న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని శ్రీ మాతా వైష్ణో దేవి కాత్రా SF ఎక్స్‌ప్రెస్ కోచ్ A-1 నుండి ఐదు బ్యాగులు అదృశ్యమైనట్లు రైల్వే అధికారులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు ఆధారంగా, FIR నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు" అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. CCTV ఫుటేజ్‌లను సమీక్షించిన తర్వాత బీహార్ కు చెందిన అమిత్, కరణ్, గౌరవ్‌లను అరెస్టు చేశారు. ఈ ముఠా బట్టల వ్యాపారులమన్న నెపంతో రైల్వే స్టేషన్లకు సమీపంలోని హోటళ్లలో బస చేస్తూ ఉంది. ప్రయాణీకుల లగేజ్ ను పోలిన లగేజీ బ్యాగ్ లతో దొంగతనాలు చేయడం వీరి ఆర్ట్.

Next Story