అక్కడ డ్రాప్‌ చేస్తానని చెప్పి.. మహిళా ప్రయాణికురాలిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

Auto rickshaw driver arrested for sexual assault female passenger in Chandigarh. చండీగఢ్‌లోని సెక్టార్ 17 ఐఎస్‌బిటీ వద్ద దింపుతాననే నెపంతో 35 ఏళ్ల మహిళా ప్రయాణీకురాలిపై ఆటో రిక్షా డ్రైవర్

By అంజి  Published on  12 Jan 2022 7:30 AM IST
అక్కడ డ్రాప్‌ చేస్తానని చెప్పి.. మహిళా ప్రయాణికురాలిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

చండీగఢ్‌లోని సెక్టార్ 17 ఐఎస్‌బిటీ వద్ద దింపుతాననే నెపంతో 35 ఏళ్ల మహిళా ప్రయాణీకురాలిపై ఆటో రిక్షా డ్రైవర్ అత్యాచారం చేశాడు. ఈ సంఘటన జనవరి 9 ఆదివారం జరిగింది. 27 ఏళ్ల జైదేవ్ అలియాస్ ఉపేందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇటీవల వివాహం చేసుకున్నాడు. చండీగఢ్ రైల్వే స్టేషన్ సమీపంలోని దర్వా ప్రాంతంలో నివసిస్తున్నాడు.

సెక్టార్ 17 స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఓం ప్రకాష్ మాట్లాడుతూ.. బాధితురాలు న్యూఢిల్లీకి చెందినదని, ఒకరిని కలవడానికి చండీగఢ్ వచ్చారని తెలిపారు. సంబంధిత వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో, ఆమె తిరిగి ఢిల్లీ వెళ్లి రైలు ఎక్కేందుకు చండీగఢ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఢిల్లీకి రైలు అందుబాటులో లేకపోవడంతో ఆమె బస్సు ఎక్కాలని నిర్ణయించుకుంది. ఆమె రైల్వే స్టేషన్ నుండి ఐఎస్‌బీటీ చండీగఢ్‌కు ఆటో రిక్షాను అద్దెకు తీసుకుంది. ఆటో రిక్షా డ్రైవర్, ఆమెను ఐఎస్‌బీటీ వద్ద డ్రాప్ చేయడానికి బదులుగా, చండీగఢ్ సివిల్ సెక్రటేరియట్ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు, అక్కడ అతను ఆటో రిక్షాలో ఆమెపై అత్యాచారం చేశాడు.

నిందితుడు కూడా బాధితురాలిని కొట్టి రోడ్డుపై వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. డ్యూటీలో ఉన్న సివిల్ సెక్రటేరియట్ నైట్ గార్డు, బాధితురాలు రోడ్డుపై సహాయం కోసం ఏడుస్తూ కనిపించింది. అతను 112 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి విషయం చెప్పారు. ఆ వెంటనే చండీగఢ్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు సెక్టార్ 17 బస్టాప్ పార్కింగ్ ప్రాంతంలో తన ఆటో రిక్షాలో కూర్చున్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నేరం చేసిన ఆటో రిక్షాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story