Auto driver sexually assaulted 10-year-old girl on the pretext of feeding chicken. 10 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన ఆటో డ్రైవర్‌ను ముంబైలోని
By Medi Samrat Published on 30 Dec 2021 12:02 PM GMT
10 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన ఆటో డ్రైవర్‌ను ముంబైలోని కలంబోలి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చికెన్ తినిపిస్తానన్న నెపంతో బాలికను కలంబోలిలోని తన ఇంటి నుంచి కిడ్నాప్ చేసి.. ఖార్ఘర్‌లోని కారులో లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని 23 ఏళ్ల ప్రకాష్ చంద్రభూషణ్ బిసుకర్మగా గుర్తించారు. బాధిత బాలిక తన ఇద్దరు సోదరులు తమ ఇంటికి సమీపంలోని కలాంబోలిలో జరిగిన ఒక జాతరలో తిరుగుతుండగా నిందితుడు చూశాడు. నిందితుడు ఆ ముగ్గురికి చికెన్ తినిపిస్తానని చెప్పి ఆటోలో కూర్చోబెట్టాడు.
అనంతరం నిందితుడు తన ఆటోను ఖార్ఘర్‌లో పార్క్ చేసి, ఆపై పిల్లలను కారులో ఎక్కించుకున్నాడు. కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత అబ్బాయిలను దిగమని చెప్పి.. బాలికను ఖార్ఘర్‌లోని సెక్టార్-3లోని గ్యారేజ్ దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ కారులోనే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని జోన్ II డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ శివరాజ్ పాటిల్ తెలిపారు. ఇంతలో బాలురిద్దరూ ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. తల్లిదండ్రులు కలంబోలి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాలిక కిడ్నాప్‌కు గురైనట్లు సమాచారం అందించారు. బాలికను మరో ఆటో డ్రైవర్ గుర్తించి.. ఖార్ఘర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఖార్ఘర్ పోలీసులు.. కలంబోలి పోలీసులతో సంప్రదించి బాలికను తమకు అప్పగించారని పాటిల్ తెలిపారు. బాలిక జరిగిన విషయాన్ని చెప్పడంతో.. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.