తెలిసిన ఆటో డ్రైవరే.. మైనర్ బాలికపై దారుణం

Auto Driver Molested 11 Year Old girl in Medchal. మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్‌ వెంకటయ్య అత్యాచారం చేశాడు.

By Medi Samrat  Published on  5 April 2022 11:02 AM GMT
తెలిసిన ఆటో డ్రైవరే.. మైనర్ బాలికపై దారుణం

మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్‌ వెంకటయ్య అత్యాచారం చేశాడు. పాఠశాలకు వెళ్తుండగా 50 రూపాయలు ఇస్తానని ఆశ చూపి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మార్చి 31న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక పేరెంట్స్ పరువు పోతుందనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఐతే స్కూల్ టీచర్ సహాయంతో మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకీ తీసుకున్నారు.

గత నెల మార్చి 31వ తేదీన సదరు బాలిక తన స్నేహితురాళ్లతో కలిసి పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో బాలికకు తెలిసిన ఆటో డ్రైవర్ అటుగా వచ్చాడు. తన ఇంటి వద్ద దిగబెడతానని ఆమెను నమ్మించి ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు. ఆటో డ్రైవర్ వెంకటయ్య డబ్బు ఎరగా చూపి తనపై అత్యాచారం చేసినట్లు ఆ బాలిక వెల్లడించింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.


Next Story
Share it