అనుమానంతో.. భార్యను కుక్కర్‌తో కొట్టి చంపిన ఆటో డ్రైవర్‌

Auto driver kills wife over suspicion of affair in Delhi. దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్ ఏరియాలో వివాహేతర సంబంధం

By అంజి  Published on  3 Feb 2022 11:32 AM GMT
అనుమానంతో.. భార్యను కుక్కర్‌తో కొట్టి చంపిన ఆటో డ్రైవర్‌

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్ ఏరియాలో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో 26 ఏళ్ల వ్యక్తి గురువారం తెల్లవారుజామున తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు కుక్కర్‌, సిలిండర్‌తో ఆమె తలపై కొట్టాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్‌లో నివాసం ఉండే హసీం ఖాన్‌గా గుర్తించి అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. హసీంఖాన్‌గా ఆటో నడుపుతుండేవాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు హసీం ఖాన్ హత్య చేసిన తర్వాత గురువారం తెల్లవారుజామున నేరుగా గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు.

తన భార్యను హత్య చేసినట్లు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడి భార్య షాహీన్ ఖాన్ (20) మంచంపై పడి ఉండటాన్ని గుర్తించారు. బాధితురాలికి సల్మాన్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని నిందితుడు అనుమానించాడు. ఆమె తలపై కొట్టేందుకు ఉపయోగించిన కుక్కర్‌, సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. 2018 జూన్‌లో హసీం, షాహీన్‌లు వివాహం చేసుకున్నారని, వారికి పిల్లలు లేరని, నిందితులు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it