మహిళపై ఆటో డ్రైవర్ దాష్టీకం..
Auto Driver Attack On Woman. ఇచ్చిన బాకీ అడిగినందుకు మహిళ అనే కనికరం కూడా లేకుండా కాలితో తన్నాడు
By Medi Samrat Published on 6 Aug 2021 2:59 PM ISTఇచ్చిన బాకీ అడిగినందుకు మహిళ అనే కనికరం కూడా లేకుండా కాలితో తన్నాడు ఓ ఆటో డ్రైవర్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాళ్లోకెళితే.. తాడేపల్లి మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన గోవర్ధని అనే మహిళ ప్రస్తుతం విజయవాడ రాణి గారి తోటలో నివాసం ఉంటుంది. మహిళ మహానాడులో ఉండగా తాపీ మేస్త్రిగా పనిచేసే చిర్రావురుకి చెందిన గోపి కృష్ణ అనే యువకుడికి రూ. 3 లక్షల నగదు వడ్డీకి ఇప్పించింది. మహిళ అప్పు తీర్చమని అడుగుతున్నా గోపి కృష్ణ పట్టించుకోవడంలేదు.
ఈ నేఫథ్యంలోనే చిర్రావూరు వచ్చి తీసుకున్న బాకీ తీర్చమని గోపి కృష్ణను మహిళ అడిగింది. దీంతో జనసంచారం లేని కృష్ణ కరకట్టపై గోపి కృష్ణ మహిళపై దాడికి పాల్పడ్డాడు. కాలితో ఎగిరి తన్నటంతో మహిళ అక్కడే కుప్పకూలింది. మహిళ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. చిర్రావూరు, రామచంద్ర పురం గ్రామాల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం బాధిత మహిళ మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. గోవర్ధని ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు గోపీ కృష్ణను అరెస్టు చేశారు. మంగళగిరి రూరల్ ఎస్సై లోకేష్ నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.