వదినపై కత్తితో దాడి చేసిన‌ మరిది

Attack On Woman In Badradri Kothagudem Ditrict. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో దారుణం

By Medi Samrat  Published on  21 Sep 2021 9:44 AM GMT
వదినపై కత్తితో దాడి చేసిన‌ మరిది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వదినపై మరిది ఉన్మాదిలా ప్రవర్తించి కత్తితో దాడి చేసిన ఘటన జ‌రిగింది. వివ‌రాళ్లోకెళితే.. వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఇంద్రపల్లి సతీష్ భార్య రాజేశ్వరిపై సతీష్ తమ్ముడు ఇంద్రపల్లి నరేష్ ఇంట్లోకి ప్రవేశించి ఉన్మాదిలా ప్రవర్తిస్తూ మెడ భాగంలో కత్తితో దాడి చేశాడు. దీంతో రాజేశ్వరి బిగ్గరగా కేకలు వేయడంతో.. కాలనీ వాసులంతా బయటకు వచ్చి చూడగా రాజేశ్వరి రక్తపు మడుగులో పడి ఉంది.

రాజేశ్వరి ని చూసి చలించిపోయిన గ్రామస్తులు.. పారిపోతున్న నరేష్ ని వెంబడించి పట్టుకున్నారు. అనంత‌రం దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. రక్తం మడుగులో పడి ఉన్న రాజేశ్వరిని గ్రామస్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని నరేష్ ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజేశ్వరిని మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.


Next Story
Share it