చేతబడి అనుమానం.. యువకుడి సజీవదహనం
పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో నరసింహారావు అనే వ్యక్తిని యూసఫ్ అనే యువకుడు సజీవ దహనం చేశాడు.
By అంజి Published on 3 July 2023 12:13 PM ISTచేతబడి అనుమానం.. యువకుడి సజీవదహనం
ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో నరసింహారావు అనే వ్యక్తిని యూసఫ్ అనే యువకుడు సజీవ దహనం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యూసఫ్, అతడి స్నేహితుడు కలిసి నరసింహారావుకు మద్యం సేవిద్దామని చెప్పి గుత్తికొండ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. మద్యం సేవించడానికి వెళ్లేముందే పెట్రోల్ కొనుగోలు చేశాడు యూసఫ్. ఆ తర్వాత అటవీకి వెళ్లి ముగ్గురు కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న నరసింహారావుపై యూసఫ్ పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. యూసుఫ్ అన్నను ఆరు నెలల క్రితం నరసింహ కుటుంబం చేతబడి చేసి చంపారని అనుమానంతో ఈ ఘటనకు పాల్పడ్డాడని సమాచారం.
ఇదిలా ఉంటే.. నిత్యం మద్యం తాగొచ్చి తల్లిపై దాడి చేస్తున్న 28 ఏళ్ల యువకుడిని అతని తండ్రి హతమార్చాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. దొడ్డబళ్లాపురా తాలుకా వాణిగరహళ్లి గ్రామంలో శుక్రవారం రాత్రి కుమారుడిని పనస తోటకు తీసుకెళ్లాడు తండ్రి. ఆ తర్వాత కుమారుడిని చెట్టుకు కట్టేసి, పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.