ఏపీలో ఘోరం.. భార్యను చంపి బైక్‌పై తీసుకెళ్లాడు
పల్నాడు జిల్లా మాచవరంలో దారుణం జరిగింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి భార్య మహాలక్ష్మిని గొంతు నులిమి చంపేశాడు.
By - అంజి |
ఏపీలో ఘోరం.. భార్యను చంపి బైక్‌పై తీసుకెళ్లాడు
పల్నాడు జిల్లా మాచవరంలో దారుణం జరిగింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి భార్య మహాలక్ష్మిని గొంతు నులిమి చంపేశాడు. ఆపై మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి బాపట్ల జిల్లా సంతమాగులూరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరు పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకోగా.. ఇద్దరు సంతానం ఉన్నారు. కొన్ని రోజులుగా ఇరువురి మధ్య విబేధాలు తలెత్తడంతో హత్య చేసినట్టు సమాచారం.
నిందితుడు వెంకటేశ్వర్లు స్వగ్రామం సంతమాగులూరు మండలం ఏల్చూరు కాగా.. పదేళ్ల కిందట వెంకటేశ్వర్లు, మహాలక్ష్మి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు సంతానం ఉన్నారు. భార్యభర్తల మధ్య విభేదాలతో వెంకటేశ్వర్లుకు మహాలక్ష్మి దూరంగా ఉంటోంది. నిన్న రాత్రి మాచవరంలో ఉంటున్న భార్య వద్దకు వెంకటేశ్వర్లు వెళ్లాడు. ఉదయం మహాలక్ష్మిని మాచవరం శివారుకు తీసుకెళ్లి హత్యచేసిన వెంకటేశ్వర్లు.. ఆపై డెడ్‌బాడీని తీసుకుని నేరుగా పీఎస్‌కు వెళ్లాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్న రొంపిచర్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నిన్న తెలంగాణలో ఓ వ్యక్తి తన భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీతారాంపురంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. బాలాజీ రామాచారి అనే వ్యక్తి తన భార్య సంధ్య (42)ను హత్య చేసి వీడియో తీసి వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకున్నాడు. భార్య, కూతురు వేధింపులు తాళలేకనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు చెప్పాడు. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి భార్య మరణించాక అతను సంధ్యను రెండో వివాహం చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు.