8 ఏళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం.. తల్లి లేని సమయం చూసుకుని మరీ..

Atrocity in Gujarat.. Father rapes 8-year-old daughter. గుజరాత్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 35 ఏళ్ల వ్యక్తి తన ఎనిమిదేళ్ల కుమార్తెపై భార్య లేని

By అంజి  Published on  10 Jan 2023 12:16 PM IST
8 ఏళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం.. తల్లి లేని సమయం చూసుకుని మరీ..

గుజరాత్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 35 ఏళ్ల వ్యక్తి తన ఎనిమిదేళ్ల కుమార్తెపై భార్య లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి తన భర్తపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన అహ్మదాబాద్‌ నగరంలోని కృష్ణనగర్‌ ప్రాంతంలో జరిగింది. తన తండ్రి నుండి తనకు ఎదురైన కష్టాలను బాలిక ఎవరికీ చెప్పలేకపోయింది. అయితే అత్యాచారం అనంతరం బాలిక అస్వస్థతకు గురైంది. తిరిగి ఇంటికి వచ్చిన బాలిక తల్లి ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ప్రైవేట్ ఆసుపత్రిలోని వైద్యులు ఆమెను జిసిఎస్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స చేసిన డాక్టర్.. బాలికపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. డాక్టర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీస్ ఇన్‌స్పెక్టర్ బీఎమ్‌ పటేల్ మాట్లాడుతూ.. ''ఆసుపత్రి నిర్వాహకులు మాకు అత్యాచారం కేసు గురించి సమాచారం అందించారు. కృష్ణా నగర్ పోలీసుల బృందం ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి తల్లిని విచారించడం ప్రారంభించింది. అయితే అత్యాచారం జరిగిన సమయంలో తల్లి ఇంట్లో లేదని తెలిసింది. ఆ తర్వాత తండ్రి చేసిన అఘాయిత్యాన్ని బాధితురాలు తన తల్లికి వివరించింది'' అని చెప్పారు. "బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించబడింది. దర్యాప్తులో తల్లి లేని సమయంలో బాలికపై ఆమె తండ్రి అత్యాచారం చేసినట్లు తేలింది. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేయబడింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు'' అని చెప్పారు.

Next Story