ప‌సికందును పీక్కుతిన్న కుక్కలు

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి వ‌ద్ద‌ దారుణ ఘటన చోటు చేసుకున్నది. నాలుగు రోజుల నవజాత శిశువును కుక్కలు పీక్కుతిన్నాయి

By Medi Samrat  Published on  10 Aug 2024 7:46 AM IST
ప‌సికందును పీక్కుతిన్న కుక్కలు

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి వ‌ద్ద‌ దారుణ ఘటన చోటు చేసుకున్నది. నాలుగు రోజుల నవజాత శిశువును కుక్కలు పీక్కుతిన్నాయి. ఎంజీఎం క్యాజువాలిటీ ఎదుట ఈ ఘటన చోటు చేసుకున్నది. కుక్కలు శిశువు శ‌రీర బాగాల‌ను తినేశాయి. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డులు, శిశువు బంధువులు కుక్కలను చెదరగొట్టారు. ఆ తర్వాత శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఎంజీఎం మార్చూరిలో భద్రపరిచారు.

కుక్క‌ల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన‌ శిశువు ఆనవాళ్లు గుర్తించడం కష్టంగా మారింది. శిశువును కుక్కలు ఎక్కడి నుంచి తీసుకువచ్చాయి? శిశువు మృతదేహాన్ని ఎవరైనా పడేసి వెళ్లారా? అనేది తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Next Story