కామారెడ్డిలో దారుణం.. యువతిని వివస్త్రను చేసి.. ఆపై కారం చల్లి..

ఓ యువతిని వివస్త్రను చేసి కారం చల్లి పాశవికంగా దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

By అంజి  Published on  9 Feb 2024 1:01 PM IST
Kamareddy, Crime news, Telangana,

కామారెడ్డిలో దారుణం.. యువతిని వివస్త్రను చేసి.. ఆపై కారం చల్లి..

ఓ యువతిని వివస్త్రను చేసి కారం చల్లి పాశవికంగా దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆ గ్రామంలో సంచలనం రేపింది. వివాహేతర సంబంధాలు తీవ్ర అనర్థాలకు దారి తీస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ భర్త మరో యువతితో కలిసి రాసలీలలు ఆడుతున్న సమయంలో పెళ్ళాం ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడమే కాకుండా భర్తతో పాటు ఆ యువతిపై తన బంధువులతో కలిసి దాడి చేసింది. కామారెడ్డి జిల్లాలోని సంచారెడ్డి మండలం పరిధిలోని ఓ గ్రామంలో నరేష్ అనే వ్యక్తికి ఒక మహిళతో వివాహం జరిగింది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు.

అయితే గత కొంతకాలం నుండి భర్త ప్రవర్తనలో మార్పును గమనించిన భార్య భర్త గురించి ఆరా తీయడం మొదలు పెట్టింది. దీంతో భర్త నరేష్ మరో యువతితో సహజీవనం చేస్తున్నట్టుగా తెలుసుకుంది. పక్క సమాచారం తెలుసుకున్న అనంతరం ఆ మహిళ తన బంధువులకు ఈ విషయం చెప్పింది. వెంటనే నరేష్ భార్య, ఆమె బంధువులు కలిసి నరేష్ మరో యువతితో సహజీవనం చేస్తున్న సమయంలో ఇంటిపై దాడి చేశారు. యువతిని వివస్త్రను చేసి పాశవికంగా ఆమెపై దాడి చేశారు. అంతేకాకుండా ఇద్దరినీ కట్టేసి కారం చల్లి చితకబాదిన అనంతరం నరేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణమని గ్రామస్తులు అంటున్నారు

Next Story