Hyderabad: దారుణం.. 3నెలల చిన్నారిని.. రూ.4.50 లక్షలకు అమ్మకానికి పెట్టారు

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. 3 నెలల పసికందును అమ్మకానికి పెట్టిన ఘటన సంచలనం రేపింది.

By అంజి
Published on : 22 May 2024 6:00 PM IST

Hyderabad, arrest, Child selling, Crime

Hyderabad: దారుణం.. 3నెలల చిన్నారిని.. రూ.4.50 లక్షలకు అమ్మకానికి పెట్టారు

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. 3 నెలల పసికందును అమ్మకానికి పెట్టిన ఘటన సంచలనం రేపింది. ఈ దారుణానికి ప్రయత్నించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పరిధి రామకృష్ణనగర్‌లో ఓ ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

అక్షర జ్యోతి ఫౌండేషన్‌కు చెందిన మహిళలు తమకు ఆడిపిల్లలు కావాలని తిరుగుతుండగా పీర్జాదిగుడా కార్పొరేషన్ రామకృష్ణ నగర్ లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో పనిచేస్తున్న ఆర్ఎంపీని సంప్రదించారు. ఆమె మూడు నెలల చిన్నారిని రూ. 4.50 లక్షలకు ఇప్పిస్తానని చెప్పి ముందుగా వారి నుంచి 10 వేలు అడ్వాన్స్ తీసుకుంది.

మరుసటి రోజు పాప కోసం క్లినిక్‌కు వస్తానని చెప్పి వెళ్లిపోయారు. బుధవారం పాపకోసం వారు క్లినిక్‌కు రాగా వేరే మహిళ అక్కడకు ఓ పాపతో వచ్చి వీరికి అప్పగించారు. స్వచ్ఛంధ సంస్థ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు స్పాట్‌కు వచ్చి ఆర్ఎంపీ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరికొందరి మహిళలను అరెస్ట్ చేశారు.

Next Story