హైదరాబాద్‌లో దారుణం.. ప్రియురాలిపై ప్రియుడు కత్తిపీటతో దాడి

ఓ ప్రేమోన్మాది ప్రియురాలి ఇంటికి చేరి ఆమెపై కూర్చుని కత్తిపీటతో గొంతు కోసిన ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనం రేపింది.

By అంజి  Published on  18 Jun 2024 11:24 AM IST
Hyderabad, attack, Crime

హైదరాబాద్‌లో దారుణం.. ప్రియురాలిపై ప్రియుడు కత్తిపీటతో దాడి

ఓ ప్రేమోన్మాది ప్రియురాలి ఇంటికి చేరి ఆమెపై కూర్చుని కత్తిపీటతో గొంతు కోసిన ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనం రేపింది. శ్రావ్య(28) అనే యువతికి గతంలోనే వివాహం జరిగి విడాకుల కోసం ఎదురు చూస్తోంది. శ్రావ్య కాస్మోటిక్స్ వర్క్ చేస్తుంది. తన తల్లితో కలిసి పాతబస్తీలోని చత్రినాకలోని ఎస్ ఆర్ టి కాలనీలో అద్దెకు నివాసం ఉంటోంది. తల్లి కూతుర్లు ఇద్దరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అయితే శ్రావ్యకు స్కూల్ నుండే మణికంఠ అనే ఫ్రెండ్ తో పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే మణికంఠతో శ్రావ్య మాట్లాడుతూ ఉండేది.

అయితే మణికంఠ ప్రతినిత్యం తనను ప్రేమించాలంటూ వెంటపడుతూ వేధింపులకు గురిచేసాడు. కానీ శ్రావ్య అతని ప్రేమను నిరాకరించింది. మణికంఠ వేధింపులు భరించలేక శ్రావ్య కొద్దిరోజులుగా అతన్ని దూరం పెట్టింది. దీంతో అది తట్టుకోలేకపోయిన మణికంఠ ఈరోజు ఉదయం 9:00 గంటల ప్రాంతంలో ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అప్పటికే విధి నిర్వహణలో భాగంగా శ్రావ్య వాళ్ళ అమ్మ ఉద్యోగానికి వెళ్ళింది. కాసేపట్లో శ్రావ్య కూడా ఉద్యోగానికి బయలుదేరానున్న సమయంలో.. హఠాత్తుగా మణికంఠ ఇంటి లోపలికి వెళ్లి గడియ పెట్టి ప్రియురాలితో గొడవపడ్డాడు.

అనంతరం ప్రియురాలి తలపై కత్తిపీటతో గట్టిగా కొట్టి... ఆమె మీద కూర్చొని కళ్ళు పొడుస్తూ గొంతు కోశాడు. దీంతో యువతి గట్టి గట్టిగా అరవడంతో ఇంటి యజమానితో పాటు స్థానికులు పైకి వెళ్లి కిటికీ అద్దాలు పగలకొట్టి లోపలికి వెళ్లడంతో శ్రావ్యకు ప్రాణాపాయం తప్పింది. ప్రియుడు భయపడి పోయి ప్రియురాలిని వదిలేసి పారిపోయాడు. ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని శ్రావ్యను ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.. ఛత్రినాక పోలీసులు, క్లూస్ టీం ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story