బాలికపై కత్తితో దాడి చేసి బాలుడు ఆత్మహత్య

బాలికపై కత్తితో దాడి చేసి బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని అంబర్పేట్ పరిధిలో చోటుచేసుకుంది.

By అంజి  Published on  19 Jan 2024 12:20 PM IST
Hyderabad, suicide, attack, Crime news

బాలికపై కత్తితో దాడి చేసి బాలుడు ఆత్మహత్య

సినిమాల ప్రభావమో లేక స్మార్ట్‌ఫోన్ల వాడకమో తెలియదు కానీ.. చిన్న వయసులోనే పిల్లలు ప్రేమ అంటూ జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. ప్రేమించాలంటూ వెంటపడుతున్నారు. ప్రేమను నిరాకరిస్తే ప్రేమోన్మాదిగా మారుతున్నారు. తాజాగా బాలికపై కత్తితో దాడి చేసి బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని అంబర్పేట్ పరిధిలో చోటుచేసుకుంది.

అంబర్పేట్‌లో ఓ మైనర్ బాలికపై దాడి చేసిన బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అంబర్పేట్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ మైనర్ అమ్మాయిని ఓ బాలుడు తనను ప్రేమించాలని వేధింపులకు గురి చేశాడు. అందుకు బాలిక నిరాకరించింది. అయినా కూడా బాలుడు తనను ప్రేమించాలంటూ ప్రతిరోజు ఆమె వెంట తిరిగేవాడు. అయితే నిన్న బాలుడు తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కోసం తాను ఇష్టపడే అమ్మాయిని పిలవడానికి వెళ్ళాడు. కేక్ కటింగ్ కోసం రావాలని అమ్మాయిని అడిగాడు. అందుకు ఆ అమ్మాయి నిరాకరించడంతో ఆగ్రహానికి లోనైనా బాలుడు వెంటనే తన దగ్గర ఉన్న కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా.. అది గమనించిన మరో అమ్మాయి అడ్డు వచ్చింది.

దీంతో బాలుడు ఇద్దరు అమ్మాయిలను కత్తితో పొడిచి అక్కడి నుండి పారిపోయాడు. స్థానికులు వెంటనే ఇద్దరు అమ్మాయిలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటికి వెళ్లారు. అప్పటికే భయాందోళనకు గురైన బాలుడు పారిపోయాడు. అనంతరం అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అబ్బాయి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కి రావాలంటూ పిలిచారనే విషయం తెలుసుకున్న బాలుడు భయపడిపోయి విద్యానగర్ రైల్వే ట్రాక్ మీద పడుకొని సూసైడ్ చేసుకున్నాడు.

రైల్వే ట్రాక్ పై పడి ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడు మృతి చెందిన విషయం తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు తమ బాబుది ఆత్మహత్య కాదని బాలుడు తల్లిదండ్రులు అంటున్నారు. తమకు అనుమానం ఉందని ఎవరో చంపేశారు అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు తమ బాబు.. ఏం జరిగినా ఇంట్లో చెప్తాడు.. అమ్మాయి బంధువులు నిన్న మా ఇంటిమీదకు వచ్చారు బాలుడి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story