ప్రియుడి సాయంతో హత్యలు.. మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి..
Assam woman killed husband, his mother, dumped body parts in Meghalaya. ఓ మహిళ ప్రియుడితో కలిసి తన భర్త, అత్తను హత్య చేసింది.
By M.S.R Published on 20 Feb 2023 5:36 PM ISTఓ మహిళ ప్రియుడితో కలిసి తన భర్త, అత్తను హత్య చేసింది. మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచారు. కొన్ని రోజులు ఫ్రిజ్ లో దాచిన తర్వాత వాటిని పాలిథిన్ కవర్ లో ఉంచి మారుమూల ప్రాంతంలో పడేశారు. ఆపై తన భర్త, అత్త కనిపించడం లేదంటూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుుకుని దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు నిజాలు తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన అస్సాంలోని గౌహతిలో చోటు చేసుకుంది.
నూన్ మతి ప్రాంతానికి చెందిన వివాహిత బందన కలితకు ధంజిత్ దేకా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఏడు నెలల క్రితం ప్రియుడు, మరో స్నేహితుడు అరూప్ దాస్ తో కలిసి భర్త అమరేంద్ర దే, అత్త శంకరి దేవిని హత్య చేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురూ కలిసి మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికారు. వాటిని మూడు రోజులపాటు ఫ్రిజ్ లో ఉంచారు. అనంతరం మృతదేహాల ముక్కలను పాలిథిన్ కవర్ లో ఉంచి పొరుగున ఉన్న మేఘాలయలోని అటవీ ప్రాంతంలో పడేశారు. కలిత మరుసటి రోజు తన భర్త, అత్త కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కొన్ని నెలల తర్వాత అమరేంద్ర సోదరుడు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోదరుడు, తల్లి అదృశ్యం వెనుకాల కలిత ప్రమేయం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు మళ్లీ దర్యాప్తు మొదలుపెట్టారు. కొన్ని ఆధారాలు లభించడంతో పోలీసులు కలితను అదుపులోకి తీసుకుని విచారించగా.. భర్త, అత్తను హత్య చేసినట్లు విచారణలో చెప్పేసింది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా వెతకగా కొన్ని శరీర భాగాల ముక్కలు పోలీసులకు లభించాయి.