గెస్ట్‌హౌస్‌లో మోడల్‌కు మత్తుమందు ఇచ్చి.. ఫొటోలు, వీడియోలు.. ఆ తర్వాత..!

Aspiring model sedated, filmed by woman and her associates. ఉత్తరప్రదేశ్‌లోని విభూతి ఖండ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన జరిగింది. ఓ మోడల్‌కు మత్తమందు ఇచ్చి నగ్నంగా

By అంజి  Published on  26 Oct 2021 12:08 PM IST
గెస్ట్‌హౌస్‌లో మోడల్‌కు మత్తుమందు ఇచ్చి.. ఫొటోలు, వీడియోలు.. ఆ తర్వాత..!

ఉత్తరప్రదేశ్‌లోని విభూతి ఖండ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన జరిగింది. ఓ మోడల్‌కు మత్తమందు ఇచ్చి నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీసింది ఓ ముఠా. ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగింది. వివరాల్లోకి వెళ్తే.. సినిమాలు, మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తానంటూ బాధితురాలిని దియా వర్మ అనే మహిళ కలిసింది. ఆ తర్వాత అనూప్‌ ఓఝా, వరుణ్‌ తివారి, ప్రియా మిశ్రా, సందీప్‌ విశ్వకర్త, ఆయుష్‌ మిశ్రాలను తన తొటివారిగా మోడ్‌లకు దియావర్మ పరిచయం చేసింది. ఈ క్రమంలోనే స్క్రీన్‌ టెస్టుకు రావాలని మోడల్‌ను గెస్ట్‌హౌస్‌కు పిలిచారు. వారి మాయ మాటలు నమ్మిన ఆ మోడల్‌ గెస్ట్‌ హౌస్‌ వెళ్లగా.. ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తమందు కలిపి ఇచ్చారు.

ఆ తర్వాత ఓ డ్రెస్‌ ఇచ్చి మార్చుకొని రావాలని చెప్పారు. మోడల్‌ డ్రెస్‌ మార్చుకుంటుండగా.. వారు సీక్రెట్‌గా వీడియో తీశారు. ఆ వీడియోను మోడల్‌కు చూపించి నీలి చిత్రాల్లో నటించాలని, లేదంటే వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బాధిత మోడల్.. ఆ వీడియోలను డిలీట్‌ చేయాలని వారిని కోరగా, రూ.5 లక్షలు ఇస్తే డిలీట్‌ చేస్తామని అన్నారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. డబ్బులు ఇవ్వకపోవడంతో ఓ వీడియోను ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్‌ చేశారని, అప్పటి నుండి తనను వేధిస్తున్నారని బాధిత మోడల్‌ ఆరోపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story