భార్యను హత్య చేసి, ఆపై తానూ కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ లెఫ్టినెంట్ కల్నల్

Army officer shoots wife dead before turning gun on himself in Ferozepur. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో భారత సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ అధికారి తన భార్యను హత్య చేసి,

By M.S.R  Published on  9 Jan 2023 8:30 PM IST
భార్యను హత్య చేసి, ఆపై తానూ కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ లెఫ్టినెంట్ కల్నల్

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో భారత సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ అధికారి తన భార్యను హత్య చేసి, ఆపై తానూ కాల్చుకుని మరణించాడని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అధికారి సూసైడ్ నోట్‌ని వదిలిపెట్టాడు. తాను భార్యను చంపి.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఒప్పుకున్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. భార్య తన నివాసంలో శవమై కనిపించింది. ఈ జంట మధ్య వైవాహిక సమస్యలు ఉన్నాయని, వారికి తరచూ కౌన్సెలింగ్‌లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆర్మీ, పంజాబ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఆదివారం రాత్రి 9.15 గంటలకు ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్‌లోని తమ ఇంట్లో 44 ఏళ్ల ఆర్మీ అధికారి తన 42 ఏళ్ల భార్య తలపై కాల్చి చంపినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆ తర్వాత అధికారి ఒక ఆలయంలో ప్రార్థనలు చేసి, తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. అతను తీసుకున్న నిర్ణయం గురించి తెలియజేయడానికి ఆర్మీ అధికారులు ఇంట్లో అతని భార్యను సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు, ఎవరూ కాల్‌కు సమాధానం ఇవ్వలేదు. అధికారులు ఇంటికి వెళ్లి చూడగా.. అప్పటికే ఆమె చనిపోయి పడి ఉన్నట్లు కనుగొన్నారు.


Next Story